నెలలుగా జీతాలివ్వడం లేదని భగీరథ కార్మికుల ఆందోళన

నెలలుగా జీతాలివ్వడం లేదని భగీరథ కార్మికుల ఆందోళన
  • నెలల తరబడి జీతాల్లేకుండా ఎలా బతకాలి..?
  • మిషన్ భగీరథ కార్మికులు

ఖమ్మం నగరంలోని గ్రామీణ నీటిసరఫరా శాఖ కార్యాలయం ముందు మిషన్ భగీరథ కార్మికులు ఆందోళన చేపట్టారు. కొన్ని నెలలుగా జీతాలివ్వడం లేదంటూ సీఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న జీతాలు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు, అధికారులు కలిసి తమ శ్రమను దోచుకొంటున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు.
తమకు కనీస వేతనాలు కూడా ఇవ్వడం లేదని.. లేబర్ యాక్ట్ అమలుచేయకున్నా ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికైనా శ్రమదోపిడీ లేకుండా లేబర్ యాక్ట్  ప్రకారం కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.పెండింగ్ జీతాలు చెల్లించడంతోపాటు.. తమ సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు మిషన్ భగీరథ కార్మికులు.