ఈ ఫుడ్ ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి

ఈ ఫుడ్ ఫ్రిజ్‌లో అస్సలు పెట్టకండి

వారం, పదిరోజులకి సరిపడా పండ్లు, కూరగాయలు తెచ్చి ఫ్రిజ్​లో పెడుతుంటాం. రాత్రిళ్లు మిగిలిపోయిన ఫుడ్​ని కూడా ఫ్రిజ్​లోనే పెడతాం. ఆ ఆలోచన మంచిదే అయినా.. అన్ని రకాల ఫుడ్స్​ ఫ్రిజ్​ టెంపరేచర్​కి సూట్​ కావు. అలాంటి కొన్ని పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.   కీరదోసని ఫ్రిజ్​లో  పెడితే  వాటి టేస్ట్ పూర్తిగా మారుతుంది. చప్పబడతాయి అవి. పైగా ఫ్రిజ్​లో పెట్టడం వల్ల కీరదోస మెత్తబడుతుంది.  ఫ్రైడ్ ఫుడ్స్​ని ఫ్రిజ్​లో పెట్టకూడదు. ఎందుకంటే వాటిని తిరిగి వేడిచేస్తే ఫ్రెష్​గా ఉండవు. అలాగే ఉడికించిన పాస్తాని ఫ్రిజ్​లో స్టోర్​ చేయకూడదు. 

టొమాటో సాస్​ లేదా పేస్ట్​ని ఫ్రిజ్​లో పెడితే వాటిల్లోని నీరంతా పోతుంది. టెక్చ్సర్​ కూడా ఇంతకుముందులా ఉండదు. ఆలుగడ్డల్ని ఫ్రిజ్​లో పెడితే, వాటిల్లోని పిండి పదార్థమంతా చక్కెరగా మారుతుంది. వండేటప్పుడు ఆ  చక్కెర అమైనో యాసిడ్స్​తో కలిసి ఆరోగ్యాన్ని చిక్కుల్లో పడేస్తుంది.  అరటిపండ్లని ఫ్రిజ్​లో పెడితే నల్లబడతాయి. అలాగే బ్రెడ్​ని కూడా ఫ్రిజ్​లో పెట్టకూడదు. కాఫీ బీన్స్​ని కూడా ఫ్రిజ్​లో పెట్టకూడదు. వీటివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది  లేకపోయినా.. ఇవి ఫ్రిజ్​లోని మిగతా పదార్థాల​ టేస్ట్​ని అబ్జార్బ్​​ చేసి, కాఫీ టేస్ట్​ని మారుస్తాయి.