సీఎం కేసీఆర్ ఈటలను దోషిగా చూపాలని నిర్ణయించుకున్నారు

సీఎం కేసీఆర్ ఈటలను దోషిగా చూపాలని నిర్ణయించుకున్నారు

ఈటల రాజేందర్ ను దోషిగా చూపాలని సీఎం కేసీఆర్ డిసైడయ్యారన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో వేలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయన్నారు. ఇందిరా గాంధీ హయాంలో అసైన్డ్ ల్యాండ్ పంపిణి మొదలైందని..ఆ భూములను దళితులకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. అంతేకాదు అసైన్డ్ ల్యాండ్ వినియోగించుకోకుంటే తిరిగి వాపస్ ఇచ్చేలా చట్టాలు తెచ్చారని చెప్పారు. అయితే నూతన పట్టా పాస్ బుక్ లు తీసుకొచ్చిన తర్వాత..అసైన్డ్ ల్యాండ్స్ మరింత ఆక్రమణలకు గురయ్యాయన్నారు. స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో.. కొందరు అసైన్డ్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నారని ఆరోపించారు జీవన్ రెడ్డి. 
అసైన్డ్ ల్యాండ్స్ ఇతరుల చేతుల్లో వున్నా..సర్కార్ కు రెజ్యూమ్ చేయాల్సి ఉంటుందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిర్ణయిత కాల పరిమితుల్లో వెన్నక్కి తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని..దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసి.. తిరిగి వాటిని దళితులకు పంపిణి చేయాలని డిమాండ్ చేశారు.

దేవర యంజాల్ భూముల విషయంలో చాలా అక్రమాలు జరిగాయన్నారు. 600 ఎకరాలు ఈటల కొంటె.. మిగతా 900 ఎకరాలు ఏమయ్యాయని ప్రశ్నించారు జీవన్ రెడ్డి. టీఆరెస్ నేతలే ఆక్రమించారని తెలుస్తోందన్నారు. వక్త్ బోర్డు కు.. జ్యూడిషరీ పవర్స్ ఇస్తామన్న సీఎం ఇప్పటివరకు ఆ చర్యలు చేపట్టలేదన్నారు. దేవర యంజాల్ భూముల తోపాటు రాష్ట్రంలోని దేవదాయభూముల ను కాపాడాలన్నారు.

ఈటల ఇష్యూ తోనైన రాష్ట్రానికి మంచి జరుగుతుందని భావిస్తున్నామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కోకాపేట, హఫీజ్ పేట్ భూములతో పాటు నయీమ్ భూములు బయటికి రావాలన్నారు. కొంతకాలం హడావిడి చేసిన ప్రభుత్వం తర్వాత.. ఆ విషయాలను పక్కన పెట్టిందని విమర్శించారు.