ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించండి : డిప్యూటీ సీఎం భట్టి

ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించండి : డిప్యూటీ సీఎం భట్టి
  •     గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కోరిన డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్ ,వెలుగు: రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆదివారం రాజ్ భవన్‌‌‌‌లో గవర్నర్‌‌‌‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు. 

ఈ సందర్భంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు డిప్యూటీ సీఎం పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. డిప్యూటీ సీఎం వెంట ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెక్రటరీలు గౌరవ్ ఉప్పల్, సిక్తా పట్నాయక్ తదితరులు ఉన్నారు.