రిస్క్ కంట్రీస్‌ నుంచి వచ్చిన 535 మందికి కరోనా

రిస్క్ కంట్రీస్‌ నుంచి వచ్చిన 535 మందికి కరోనా

హైదరాబాద్, వెలుగు:  కరోనా బారిన పడి టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చికిత్స పొందుతున్న 13 మందికి సోకిన వేరియంట్ ఒమిక్రాన్ కాదని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించింది. యూకే, సింగపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితర దేశాల నుంచి వచ్చిన ఈ 13 మందికి ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులో చేసిన ఆర్టీపీసీఆర్ టెస్టులో కరోనా పాజిటివ్ రావడంతో, టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఐసోలేట్ చేశారు. వీరి శాంపిళ్లను జీనోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీక్వెన్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించగా, సోమవారం రిపోర్టులు వచ్చాయి. వీరిలో ఎవరికీ ఒమిక్రాన్ వేరియంట్ సోకలేదని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఎట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిస్క్ కంట్రీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి సోమవారం మరో 535 మంది వచ్చారని, వీళ్లందరికీ కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. వీరంతా హోమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐసోలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్నారని తెలిపారు. 

195 మందికి పాజిటివ్

రాష్ట్రంలో మరో 195 మంది కరోనా బారిన పడ్డారని హెల్త్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్రకటించింది. సోమవారం 37,108 మందికి టెస్టులు చేస్తే, గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో  78 మందికి, జిల్లాల్లో 117 మందికి పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. మొత్తం కేసుల సంఖ్య 6,77,138కి చేరిందని అధికారులు పేర్కొన్నారు. కరోనాతో సోమవారం మరొకరు చనిపోయారని, మృతుల సంఖ్య 4 వేలకు పెరిగిందని బులెటిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పేర్కొన్నారు.