అమ్మాయికి బైక్ నేర్పుతుంటే ఎంత పనైంది.. జగిత్యాల జిల్లాలో విషాద ఘటన

అమ్మాయికి బైక్ నేర్పుతుంటే ఎంత పనైంది.. జగిత్యాల జిల్లాలో విషాద ఘటన

జగిత్యాల జిల్లా: మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్లోకి బైక్ దూసుకెళ్లింది. స్నేహితురాలికి బైక్ నేర్పిస్తున్న క్రమంలో అదుపు తప్పి కెనాల్లోకి బైక్ దూసుకెళ్లడంతో యువతీ, యువకుడు గల్లంతయ్యారు. కాలువలో గల్లంతైన ఇద్దరినీ వెల్లుల గ్రామానికి చెందిన లావణ్య, మెట్పల్లి పట్టణానికి చెందిన అంకూస్గా పోలీసులు గుర్తించారు. కెనాల్లో పడ్డ బైక్ను బయటకు తీసి పోలీసులు దర్యాప్తు చేశారు. కెనాల్ నీటి ప్రవాహాన్ని ఆపేసి శుక్రవారం ఉదయం పోలీసులు గాలింపు చేపట్టనున్నారు.

గల్లంతైన యువకుడి స్వస్థలం నిర్మల్ జిల్లా బైంసా కాగా ఏడాది కాలంగా మెట్ పల్లిలోని అక్కా బావ దగ్గర ఉంటూ అంకూస్ స్థానికంగా పనులకు వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే లావణ్యతో పరిచయం అయింది. లావణ్యకు బైక్ నేర్చుకోవాలనే సరదా ఉండేది. ఈ క్రమంలోనే.. తన బైక్పై డ్రైవింగ్ నేర్పించే క్రమంలో లావణ్య బైక్ నడుపుతుండగా అదుపు తప్పి బైక్ కెనాల్లోకి దూసుకెళ్లింది. బ్రేక్లు వేసే క్రమంలో లావణ్య గందరగోళానికి గురి కావడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కెనాల్స్ మీద ఇలా బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడం మంచిది కాదని పోలీసులు సూచించారు.