మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు..

మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు..

మహబూబాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. జిల్లాలోని నర్సింహులు పేట పెద్ద నాగారం కేజీ సమీపంలోని నర్సరీ దగ్గర కనిపించదంతో భయాందోళనకు గురయ్యారు స్థానికులు. గురువారం ( అక్టోబర్ 22 ) ఉదయం పెద్దపులిని చూసిన కొందరు గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

పులి కదలికలకు సంబంధించిన వార్తలతో పెద్ద నాగారం పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రైతులు,కూలీలు పొలాలకు వెళ్లే మార్గం కావడంతో.. అటు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు పులి కోసం గాలింపు చేపట్టారు. పులి కదలికలు గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

పులి సంచరిస్తున్న ప్రాంతంలో ఒంటారిగా వెళ్లోద్దని సూచిస్తున్నారు అధికారులు. పులి పాదముద్రలు, కదలికలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు అధికారులు.