నిర్మల్ జిల్లాలో రచ్చ రచ్చ.. డాక్టర్పై పేషెంట్ ఫ్యామిలీ దాడి.. రోడ్డెక్కిన వైద్యులు

నిర్మల్ జిల్లాలో రచ్చ రచ్చ.. డాక్టర్పై పేషెంట్ ఫ్యామిలీ దాడి.. రోడ్డెక్కిన వైద్యులు

నిర్మల్ జిల్లాలో హాస్పిటల్ బిల్లు విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా తయారైంది. పేషెంట్ ఫ్యామిలీ డాక్టర్ పై దాడి చేయడంతో డాక్టర్లు రోడ్డెక్కారు.వైద్యులకు మద్ధతుగా భారీ ఎత్తున జనాలు తరలిరావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

వివరాల్లోకి వెళ్తే.. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ సంతోష్ రాజ్ ఆస్పత్రిలోని వైద్యులపై  కొందరు వ్యక్తుల దాడి చేశారు. ఆసుపత్రికి  బిల్లు విషయంలో సిబ్బందితో వాగ్వాదానికి దిగి.. ఆపై పిల్లల డాక్టర్ సంతోష్ రాజ్ పై దాడికి దిగారు. 

►ALSO READ | అమ్మాయికి బైక్ నేర్పుతుంటే ఎంత పనైంది.. జగిత్యాల జిల్లాలో విషాద ఘటన

దాడిని కండిస్తూ వైద్యులు రోడ్డెక్కారు.  జయశంకర్ చౌరస్తాలో రాస్తారోకోకు పిలుపునిచ్చారు. డాక్టర్లకు మద్ధతుగా పట్టణ ప్రజలు తరలిరావడంతో రోడ్లన్నీ బ్లాకై పోయాయి. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు ఇబ్బంది ఏర్పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దాడికి పాల్పడ్డ వారిని వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తూ రోడ్డుమీదే బైఠాయించారు. పోలీసులు సర్ది చెప్పినా ధర్నాను ఆపకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.