Team India: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2026– -27 సంవత్సరానికి సంబంధించి టీమిండియా స్వదేశీ మ్యాచుల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఈ సుదీర్ఘ సీజన్‌లో వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే, ఆస్ట్రేలియా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. మొత్తం 22 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను 17 నగరాల్లో ఆడనుంది. ఇక మన హైదరాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో ఒక టీ20, జింబాబ్వేతో ఒక వన్డే మ్యాచ్ జరగనుండటం విశేషం. కాగా ఈ వన్డే మ్యాచులను టీమిండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఆడనున్నారు.
వెస్టిండీస్ టూర్:
భారత జట్టు వెస్టిండీస్‌తో మూడు వన్డేలతో పాటు 5 టీ20లు ఆడనుంది. ఈ వన్డే మ్యాచులు త్రివాండ్రమ్, గువాహతి, న్యూ చండీగఢ్, టీ20Iలు లక్నో, రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరగనున్నాయి.
మ్యాచ్ తేదీ సమయం టైపు వేదిక
1 27‑సెప్టెంబర్ ‑2026 2:00 PM 1st వన్డే త్రివాండ్రమ్
2 30‑సెప్టెంబర్‑2026 2:00 PM 2nd వన్డే గువాహతి
3 03‑అక్టోబర్‑2026 2:00 PM 3rd వన్డే న్యూ చండీగఢ్
4 06‑అక్టోబర్‑2026 7:00 PM 1st టీ20 లక్నో
5 09‑అక్టోబర్‑2026 7:00 PM 2nd టీ20 రాంచీ
6 11‑అక్టోబర్‑2026 7:00 PM 3rd టీ20 ఇండోర్
7 14‑అక్టోబర్‑2026 7:00 PM 4th టీ20 హైదరాబాద్
8 17‑అక్టోబర్‑2026 7:00 PM 5th టీ20 బెంగళూరు
శ్రీలంక పర్యటన:
వెస్టిండీస్ తో సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంక వర్సెస్ భారత్ మధ్య 3 వన్డేలు, 3 టీ20లకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ వన్డేలు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్, టీ20Iలు రాజ్‌కోట్, కటాక్, పుణేలో జరుగుతాయి.
మ్యాచ్ తేదీ సమయం టైపు వేదిక
1 13‑డిసెంబర్‑2026 2:00 PM 1st వన్డే ఢిల్లీ
2 16‑డిసెంబర్‑2026 2:00 PM 2nd వన్డే బెంగళూరు
3 19‑డిసెంబర్‑2026 2:00 PM 3rd వన్డే అహ్మదాబాద్
4 22‑డిసెంబర్‑2026 7:00 PM 1st టీ20 రాజ్‌కోట్
5 24‑డిసెంబర్‑2026 7:00 PM 2nd టీ20 కటాక్
6 27‑డిసెంబర్‑2026 7:00 PM 3rd టీ20 పుణే
జింబాబ్వే టూర్:
2027వ సంవత్సరం ప్రారంభంలో జింబాబ్వే భారత్ తో 3 వన్డేల సిరీస్ కోసం రానుంది. ఈ మ్యాచులు కోలకతా, హైదరాబాద్, ముంబైలో జరుగుతాయి.
మ్యాచ్ తేదీ సమయం టైపు వేదిక
1 03‑జనవరి‑2027 2:00 PM 1st వన్డే కోలకతా
2 06‑జనవరి‑2027 2:00 PM 2nd వన్డే హైదరాబాద్
3 09‑జనవరి‑2027 2:00 PM 3rd వన్డే ముంబై
ఆస్ట్రేలియా టూర్:
ఆస్ట్రేలియాతో భారత్ అత్యంత ప్రతిష్టాత్మకమైన 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ జనవరి 21వ తేదీ నుంచి మార్చి 3 వరకు కొనసాగనుంది. నాగ్‌పూర్, చెన్నై, గువాహతి, రాంచీ, అహ్మదాబాద్లో నగరాల్లో టెస్టు మ్యాచులతో ముగిస్తుంది.
మ్యాచ్ తేదీ సమయం టైపు వేదిక
1 జనవరి21 నుంచి జనవరి 25 వరకు 9:30 AM 1st టెస్ట్ నాగ్‌పూర్
2 జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు 9:30 AM 2nd టెస్ట్ చెన్నై
3 ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 15 వరకు 9:00 AM 3rd టెస్ట్ గువాహతి
4 ఫిబ్రవరి 19 నుంచి ఫిబ్రవరి 23వరకు 9:30 AM 4th టెస్ట్ రాంచీ
5 ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 3 వరకు 9:30 AM 5th టెస్ట్ అహ్మదాబాద్
