అబుదాబిపై ఇరాన్ మిసైళ్ల దాడి.. శకలాలు పడి భారతీయుడి మృతి

అబుదాబిపై ఇరాన్ మిసైళ్ల దాడి..  శకలాలు పడి  భారతీయుడి మృతి

గల్ఫ్​ దేశాలలో జరుగుతున్న యుద్ధంలో మరో భారతీయుడు బలయ్యాడు.  గురువారం (మార్చి 26)  అబుదాబిపై ఇరాన్ మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో స్వేహాన్ వీధిలో ఇరాన్ బాలిస్టిక్ మిస్సైల్‌ను UAE ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. మిసైల్ ను పేల్చేయడంతో వచ్చిన శకలాల కింద పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. శకలాలు తగిలి భారతీయుడు మృతి చెందడం విషాదంగా మిగిలింది. చనిపోయిన వారిలో మరో వ్యక్తి పాకిస్తానీయుడిగా గుర్తించారు.

ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒక భారతీయుడితో పాటు జోర్డాన్ పౌరుడు ఉన్నట్లు జోర్డాన్ విదేశాంగ  శాఖ ప్రకటించింది. యూఏఈపై దాడిని జోర్డాన్ ఖండించింది. 

►ALSO READ | మే 14 లోపు యుద్ధం ముగించాలని చూస్తున్న ట్రంప్.. కారణం ఇదే..!

ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం మొదలైనప్పటి నుంచి UAEలో ఇప్పటికే 9 మంది చనిపోయారు. అందులో ముగ్గురు UAE సైనికులు, మిగిలినవారు విదేశీయులుగా యూఏఈ అధికారులు తెలిపారు. గురువారం చనిపోయిన ఇద్దరితో కలిపి చనిపోయిన వారి సంఖ్య 11 మందికి చేరుకుంది.