హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ హానర్స్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 27న జరిగిన ‘లీగల్ అండ్ కాన్‌స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ ఇండియా’ పరీక్షను రద్దు చేసి, ఈ నెల 7న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి మార్పు లేదని, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగనుందని స్పష్టం చేశారు.
అయితే, గతనెల 25న ఐదేండ్ల ఎల్ఎల్‌బీ, మూడేండ్ల ఎల్ఎల్‌బీ ఫస్టియర్ స్టూడెంట్లకు జరిగిన హిస్టరీ ఆఫ్ కోర్ట్స్, లెజిస్లేచర్స్ అండ్ లీగల్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా పరీక్ష.. 27న జరిగిన హానర్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లు సేమ్ ఉండటంతో.. ఈ పరీక్షను రద్దు చేశారు.
