ఈనెల 19 నుంచి కోర్టుల్లో పాక్షిక ప్రత్యక్ష విచారణ

ఈనెల 19 నుంచి కోర్టుల్లో పాక్షిక ప్రత్యక్ష విచారణ
  • కోర్టు సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశం
  • హైకోర్టులో నెలాఖరు వరకు ఆన్ లైన్ విచారణ విధానం

హైదరాబాద్: కోర్టుల్లో అన్ లాక్ ప్రారంభించడంపై  హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 19 నుంచి కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ చేపట్టాలని ఆదేశించింది. అన్ లాక్ ప్రక్రియ నేపధ్యంలో ఇక నుంచి కోర్టు సిబ్బంది అందరూ విధులకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ఇప్పటి వరకు సగం మంది పనిచేయాలన్న నిబంధన మేరకు సిబ్బంది  రోజు విడిచి రోజు విధులకు హాజరవుతున్న విషయం తెలిసిందే. అన్ లాక్ మొదలుపెట్టాలని నిర్ణయించిన హైకోర్టు ఈనెల 19 నుంచి అన్ని కోర్టుల్లో పాక్షికంగా ప్రత్యక్ష విచారణ జరపాలని ఆదేశాలిచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలు మినహా రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో పాక్షిక ప్రత్యక్ష విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లోఈనెల 31 వరకు ఆన్ లైన్ విచారణ కొనసాగించాలని హైకోర్టు సూచించింది. మిగతా ఉమ్మడి జిల్లాల్లో ఈనెల 16 వరకు ఆన్ లైన్ విచారణ కొనసాగుతుంది, మిగతా జిల్లాల్లో ఈనెల 19 నుంచి పాక్షికంగా ప్రత్యక్షంగా విచారణ ప్రారంభించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అదేవిధంగా హైకోర్టులో మాత్రం ఈనెల 31వ తేదీ వరకు ఆన్ లైన్ విచారణ విధానం కొనసాగుతుంది.