రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా

రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లదు.. నా వీడియో ఎడిట్ చేసి  దుష్ప్రచారం చేస్తున్నారు: అమిత్ షా

రిజర్వేషన్లపై ప్రచారమైన ఫేక్ వీడియోపై కేంద్ర హోంమంత్రి  స్పందించారు. తన ఫేక్    వీడియోలు  సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్  సభలో మాట్లాడిన అమిత్ షా..  ఎన్నికల్లో గెలవడానికా కాంగ్రెస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు. తన  వీడియో ఎడిట్ చేసి దుష్ర్పచారం చేస్తున్నారని చెప్పారు.  రిజర్వేషన్ల జోలికి బీజేపీ వెళ్లబోదని.. ముస్లీం రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఇస్తామన్నారు.

ఇప్పటి వరకు జరిగిన రెండు విడుత లోక్ సభ ఎన్నికల్లో  మోదీ సెంచరీ  కొట్టేశారని అమిత్ షా అన్నారు. మూడో విడుత పోలింగ్ లో 150 సీట్లను దాటేస్తారు..  తెలంగాణలో ఎన్నికలు ముగిసే సరికి 250 సీట్లను గెలుచుకోవడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు అమిత్ షా.  తెలంగాణలో బీజేపీ ఓటు  షేర్  పెరిగింది 10 కంటే ఎక్కువ సీట్లు గెలవబోతున్నామనిచెప్పారు.  తెలంగాణ  ప్రజల గురించి మల్లికార్జున ఖర్గేకు ఏం తెల్వదన్నారు.

 ఎన్డీయే కూటమి..ఇండియా కూటమికి మధ్య  పోటీ జరుగుతోందన్నారు అమిత్ షా.. ఓ వైపు మోదీ..మరో వైపు రాహుల్ ఉన్నారని చెప్పారు.   మోదీ ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పనిచేస్తే..  రాహుల్ సెలవు వచ్చిందంటే.. బ్యాంకాక్ లో సేద తీరుతారని ఎద్దేవా చేశారు. అయోధ్య లో  భవ్య రామందిరం నిర్మించాం..  70 ఏళ్ల పాటు కాంగ్రెస్ కాలయాపన చేసిందన్నారు.   కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు అమిత్ షా