ఓజీ సినిమా టికెట్‌‌‌‌కు రూ. 1.30 లక్షలు

ఓజీ సినిమా టికెట్‌‌‌‌కు రూ. 1.30 లక్షలు

చౌటుప్పల్, వెలుగు: ఏపీ, తెలంగాణలో ఓజీ మూవీ మేనియా నడుస్తున్నది. ఈ సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ రూ.1.30 లక్షలు పలికింది.  పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ‘ఓజీ’ సినిమా బెనిఫిట్ షో మొదటి టికెట్ కు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీనివాస థియేటర్ లో ఆదివారం వేలం పాట నిర్వహించారు. 

ఇందులో 15 మందికిపైగా పోటీపడగా లక్కారం గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్ అభిమాని ఆముదాల పరమేశ్ రూ.1,29,999లకు దక్కించుకున్నారు. ఈ డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇస్తానని తెలిపారు.