హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌తో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ గురువారం హైద రాబాద్‌లో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించిన కులగణనపై సుదీర్ఘంగా చర్చించారు.
బడుగు, బలహీన వర్గాలకు అందుతున్న పథకాల అమలు తీరు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై సమీక్షించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కొత్త డీసీసీ అధ్యక్షులు పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలపై చర్చలు జరిపారు.17 కుల సంఘాల కార్పొరేషన్, ఫెడరేషన్ చైర్మన్‌లు, సభ్యుల నియామకంపై కూడా మీనాక్షి నటరాజన్, మహేశ్ గౌడ్ మరోసారి చర్చించారు.

