ఖమ్మం, వెలుగు: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో ఈనెల 7వ తేదీతో పాలకవర్గ గడువు ముగియనుండడంతో శనివారం బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఖమ్మం క్యాంప్ ఆఫీస్ లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ప్రజల్లో ఉండి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయ పరిపక్వత లేని వాళ్లే బీఆర్ఎస్ ని వదిలి పోయారని, అనుభవం ఉన్నవాళ్లు తనతో ఉన్నారని చెప్పారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో కష్టపడి అత్యధిక స్థానాలు గెలవాలని పిలుపునిచ్చారు.
