ముగిసిన రాహుల్ గాంధీ పర్యటన

ముగిసిన రాహుల్ గాంధీ  పర్యటన

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ శంషాబాద్ వెళ్లారు. అక్కడ్నుంచి ఢిల్లీ వెళ్తారు. రాహుల్ కు వీడ్కోలు చెప్పేందుకు కూడా కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు. రెండ్రోజులపాటు రాష్ట్రంలో బిజీగా పర్యటించారు రాహుల్. నిన్న సాయంత్రం శంశాబాద్ లో దిగగానే నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ వెళ్లారు. అక్కడ ర్యాలీ తర్వాత ఆత్మహత్య చేసుకున్న రైతు కుంటుంబాలతో మాట్లాడారు. బహిరంగసభ తర్వాత నేరుగా హైదరాబాద్ వచ్చి తాజ్ కృష్ణలో పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించారు.

ఇవాళ ఉదయం నుంచి బిజీగా గడిపారు రాహుల్. ఉదయమే హోటల్ కాంగ్రెస్ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. తర్వాత సంజీవయ్య పార్క్ కు వెళ్లి అక్కడ దివంగత మాజీ సీఎం దామోదరం సంజీవయ్యకు నివాళులర్పించారు. తర్వాత నేరుగా చంచల్ గూడ జైలుకు వెళ్లి అక్కడ NSUI నేతలను పరామర్శించారు. తర్వాత గాంధీభవన్ లో PCC ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. తర్వాత పార్టీ ఎన్ రోలర్స్ తో ఫోటోలు దిగారు. అక్కడ్నుంచి నేరుగా అమరవీరుల స్థూపం నిర్మాణం జరిగే ప్రదేశానికి వెళ్లారు. నిర్మాణ పనులను చూశారు. తర్వాత శంశాబాద్ కు వెళ్లారు రాహుల్. 

రాహుల్ టూర్ తో కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ వచ్చింది. వరంగల్ డిక్లరేషన్ నాయకులకు కొత్త ఊపునిచ్చింది. అటు రాహుల్ కూడా నేతలకు సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చారు. నిత్యం జనంలోనే ఉండాలని సూచించారు. ఢిల్లీ వస్తే టికెట్స్ వస్తాయనుకోవద్దని హెచ్చరించారు. చంచల్ గూడలో విద్యార్థి నేతలను కలిసి వాళ్లక భరోసా ఇచ్చారు రాహుల్. మొత్తానికి రాహూల్ టూర్ కాంగ్రెస్ కేడర్ కు కొత్త ఊపునిచ్చిందంటున్నారు లీడర్లు.