తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

బంగాళాఖాతం, పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం  ఫలితంగా రాష్ట్రమంతటా ఇప్పటికే హైదరాబాద్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో... రానున్న 3 రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి.. మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు... కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయన్నారు. కొమ్రం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల సహా... ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.