RajiniKamal : 'KHxRK' గ్లింప్స్ రిలీజ్.. 46 ఏళ్ల తర్వాత ఒక్కటైన రజనీ-కమల్..! ఫ్యాన్స్ లో పూనకాలు

RajiniKamal : 'KHxRK' గ్లింప్స్ రిలీజ్.. 46 ఏళ్ల తర్వాత ఒక్కటైన రజనీ-కమల్..!  ఫ్యాన్స్ లో పూనకాలు

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనాయకుడు కమల్ హాసన్ దాదాపు 46 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ ఒకే సినిమాలో నటిస్తున్నారు.  నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'KHxRK' (వర్కింగ్ టైటిల్) చిత్ర గ్లింప్స్ శుక్రవారం ( ఫిబ్రవరి 21న )  విడుదలైంది.  వీరిద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించడంతో అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.  సోషల్ మీడియాలో రికార్డులను తిరగరాస్తోంది.

రెట్రో లుక్‌లో లెజెండ్స్!

తాజాగా విడుదలైన 4 నిమిషాల ప్రొమోలో రజనీకాంత్, కమల్ హాసన్ వింటేజ్ లుక్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. లెదర్ జాకెట్లు, స్టైలిష్ షేడ్స్‌తో వారు ఒలికించిన మేనరిజమ్స్ 1980ల నాటి గోల్డెన్ డేస్‌ని గుర్తుకు తెచ్చాయి. ఈ గ్లింప్స్ చూసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హిస్టారికల్ కాంబో.. 

నిజానికి వీరిద్దరూ కలిసి చివరిసారిగా 1979లో 'అల్లావుద్దీన్ అద్భుత దీపం' చిత్రంలో నటించారు . సరిగ్గా 46 ఏళ్ల విరామం తర్వాత ఈ ఇద్దరు స్నేహితులు మళ్ళీ చేతులు కలపడం భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన ప్రాణమిత్రుడు రజనీతో కలిసి చేస్తున్న అద్భుత చిత్రంగా నిలుస్తోందంటున్నారు.  

భారీ బడ్జెట్ తో

 'జైలర్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకడు నెల్సన్ ఈ భారీ బాధ్యతను తీసుకున్నారు. ఈ మూవీ దాదాపు రూ. 600 కోట్ల భారీ వ్యయంతో  తెరకెక్కుతోంది.  రజనీకాంత్ కేవలం ఈ సినిమా కోసం రూ. 225 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్  సంగీతం అందిస్తున్నారు. రెడ్ జాయింట్ పిక్చర్స్  రాజ్ కమల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ 2026 ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. ఈ క్రేజీ మల్టీస్టారర్‌ను 2027 సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.