
తనకు ధనవంతరి హోమం జరిపించాలన్నారు మాతంగి స్వర్ణలత. మీర్ ఆలం మండి మహాంకాళి ఆలయంలో రంగం భవిష్యవాణి కార్యక్రమం వినిపించారు. భవిష్యవాణి కార్యక్రమం చూడడానికి భారీగా తరలి వచ్చారు జనం.
ఈ సందర్బంగా భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత. మీరు చేసిన పూజలతో సంతోషంగా ఉన్నా. ప్రజలందరిని ఏ ఆటంకం కలగకుండా చూసుకొంటా. బాల బాలికలకు ఏ ఆపద రాకుండా చూసుకుంటా. రాబోయే రోజుల్లో కోరినన్ని వర్షాలు పడతాయి. మహమ్మారితో జాగ్రతగా ఉండడండి. నాకు ధనవంతరి హోమం జరిపించాలి. నన్ను కోరిన వారికి కొంగు బంగారం ఇస్తా. నచ్చిన విధంగా పూజలు జరిపించుకుంటా.
భక్తులు కోరినంత వరకు ఇస్తా.. నా అక్కాచెల్లెళ్ల జోలికి వస్తే ఉగ్రరూపం దాలుస్తా. వ్యాపారాలు బాగుంటాయి. ఐదు వారాలు పప్పు బెల్లం ఫలహారాలతో ప్రసాదం పెట్టాలి కోరిన కోరికలు తీరుస్తా అని చెప్పారు మాతంగి స్వర్ణలత.
మహమ్మారి వెంటాడ్తది
ఇటీవల జరిగిన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల కార్యక్రమంలో కూడా భవిష్య వాణి వినిపించారు మాతంగా స్వర్ణలత. ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయని, పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని.. కానీ, రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుందని చెప్పారు. అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.