- రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, అవగాహనతోనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయొచ్చని రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్లో రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీస్, మున్సిపల్, నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ, ఆర్ టీసీ అధికారులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు.
వాహనదారులు, ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చన్నారు. హైస్పీడ్, డ్రంకెన్ డ్రైవ్ వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. రోడ్డు ప్రమాదాలు లేని జిల్లాగా రంగారెడ్డిని మార్చేందుకు అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
