ఆస్ట్రేలియాతో సిరీస్కు ఆంధ్రా ప్లేయర్!

ఆస్ట్రేలియాతో సిరీస్కు ఆంధ్రా ప్లేయర్!

ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభం కాబోయే భారత్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ కు టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ దూరం అవుతున్నాడన్న విషయం తెలిసిందే. అయితే, అతని స్థానంలో ఆంధ్రా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ శ్రీకర్ భరత్ అరంగేట్రం చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భరత్ దీనికి సంబంధించిన సూచనలు ఇప్పటికే బీసీసీఐ నుంచి అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ కి భరత్‌కి పోటీగా ఇషాన్ కిషన్‌ని కూడా టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. కొంతకాలంగా టీమిండియా తరుపున రాణిస్తున్న ఇషాన్‌ని జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు. 

ఈ క్రమంలో ఇషాన్‌ను, భరత్‌కు బ్యాక్అప్ వికెట్ కీపర్‌‌గా తీసుకుంటారా లేక తుది జట్టులో చోటు కల్పిస్తారా అన్నది చూడాలి. టెస్టుల్లో ఘనాంకాల పరంగా చూసుకుంటే భరత్‌ని ఎంపిక చేసే అవకాశాలే కనిపిస్తున్నాయి. కొంతకాలంగా ఇండియా ఏ టీం తరుపున టెస్ట్‌ల్లో ఆడుతున్న అనుభవం భరత్‌కి ఉంది. అంతేకాకుండా నవంబర్ 2019లో టెస్ట్ జట్టుకి కాల్ అందుకున్నా భరత్ కి ఇప్పటివరకు బరిలోకి దిగే ఛాన్స్ రాలేదు. నవంబర్ 2021లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ టీంలో వ్రిద్ధిమాన్ సాహాకు గాయం అవడంతో, అతని స్థానంలో కీపింగ్ చేసి రెండు క్యాచ్‌లు, ఒక స్టంప్ ఔట్ చేశాడు.