GT vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు..మ్యాక్స్ వెల్ ఎంట్రీ

GT vs RCB: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బెంగళూరు..మ్యాక్స్ వెల్ ఎంట్రీ

ఐపీఎల్ నేడు మరో ఆసక్తికర సమరం ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ ల్లో రెండు మ్యాచ్ లే గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో చివరి స్థానములో ఉంది. మరోవైపు గుజరాత్ 9 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ లో లాకీ ఫెర్గుసన్ స్థానంలో గాయం నుంచి కోలుకున్న మ్యాక్ వెల్ జట్టులోకి వచ్చాడు.

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI):

వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI):

విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్ ), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్