Ranbir Kapoor: బూతులతో రెచ్చిపోయిన ఫోటోగ్రాఫర్.. సీరియస్ అయిన రణ్బీర్

Ranbir Kapoor: బూతులతో రెచ్చిపోయిన ఫోటోగ్రాఫర్.. సీరియస్ అయిన రణ్బీర్

మాములుగా సెలెబ్రెటీలు ఎక్కడ ఉంటే మీడియా, రిపోర్టర్స్, ఫొటోగ్రాఫర్స్ అక్కడ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు చేసే హడావిడికి సస్టార్స్ కొన్నిసార్లు సహనం కోల్పోయి అరిచిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ, బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్(Ranbir Kapoor) విషయంలో మాత్రం అది రివర్స్ అయ్యింది. ఇంతకీ అసలు  విషయం ఏంటంటే.. స్టార్ హీరో రణ్బీర్ కపూర్ తాజాగా ఓ జెవెలరీ షాప్ ఓపెనింగ్ కోసం గుజరాత్ లోని సూరత్ ప్రాంతానికి వెళ్ళాడు. 

రణ్బీర్ వస్తున్న విషయం తెలియడంతో చాలా మంది జనాలతో పాటు మీడియా కూడా అక్కడికి చేరుకుంది. అందులో ఓ ఫోటోగ్రాఫర్ రణ్బీర్ ఫోటోలు తీయడానికి ట్రై చేశాడు. కారణం ఏంటో తెలియదు కానీ, ఆ ఫోటోగ్రాఫర్ రణ్బీర్ ను అసభ్య పదజాలంతో దూషించాడు. ఆ మాటలు రణ్బీర్ కు వినబడటంతో ఒక్కసారిగా షాకయ్యాడు.  ఆ ఫోటోగ్రాఫర్ వైపు  ఆశ్చర్యంగా చూస్తూ.. ఇక్కడ ఏం జరుగుతుంది.. అంటూ ఫైర్ అయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక రణ్బీర్ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ఇటీవలే యానిమల్ సినిమాతో కేరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం నితీష్ తివారితో రామాయణ సినిమా చేస్తున్నాడు. భారీ హంగులతో మూడు పార్టులుగా వస్తున్న ఈ సినిమాలో రణ్బీర్ రాముడిగా కనిపిస్తుండగా.. సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన సీతారాముల లుక్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇక రామాయణ మొదటి భాగం వచ్చేఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.