V6 News

మండల అభివృద్ధికి నిధులు ఇవ్వండి.. మంత్రి వివేక్‌‌‌‌ను కోరిన కొన్యాల బాల్ రెడ్డి

మండల అభివృద్ధికి నిధులు ఇవ్వండి..  మంత్రి వివేక్‌‌‌‌ను కోరిన కొన్యాల బాల్ రెడ్డి
  • జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి వివేక్‌‌‌‌ను కోరిన కొన్యాల బాల్ రెడ్డి

ములుగు, వెలుగు: సిద్దిపేట జిల్లా ములుగు మండలం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ జిల్లా ఇన్‌‌‌‌చార్జి మంత్రి వివేక్​ వెంకటస్వామిని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొన్యాల బాల్‌‌‌‌రెడ్డి కోరారు. శనివారం ఆయన హైదరాబాద్‌‌‌‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా పేదల కోసం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని, అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ భరోసా, స్త్రీ శక్తి రుణాలు.. వంటి వాటిపై ప్రజల్లో ప్రచారం చేయాలని మంత్రి సూచించారని బాల్‌‌‌‌రెడ్డి పేర్కొన్నారు. అనంతరం ఇటీవల క్షీరసాగర్‌‌‌‌‌‌‌‌లో శ్రీ కోదండ రామస్వామి కల్యాణంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి దంపతుల ఫొటోను అందజేశారు. ఆయన  వెంట లీడర్లు ముక్తాల వెంకటేశ్‌‌‌‌, గౌలి కారికర్, సురేశ్‌‌‌‌ పాల్గొన్నారు.