జూన్ 2న సామూహిక ఇందిరమ్మ గృహ ప్రవేశాలు.. సిద్దిపేటలో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి

జూన్ 2న సామూహిక ఇందిరమ్మ గృహ ప్రవేశాలు.. సిద్దిపేటలో గృహనిర్మాణాలను వేగవంతం చేయాలి
  •    సిద్దిపేట  కలెక్టర్ కె. హైమావతి

సిద్దిపేట రూరల్, వెలుగు :  రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సామూహిక ఇందిరమ్మ గృహ ప్రవేశాల కార్యక్రమం నిర్వహించనున్నామని, అందుకోసం జిల్లాలో స్లాబ్ లెవల్‌‌‌‌లో ఉన్న గృహాలన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు.

 గురువారం కలెక్టరేట్‌‌‌‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. గృహ నిర్మాణ పనులు స్పీడప్​ చేయాలని, ఈ నెల 30లోపు పనులు ప్రారంభించని లబ్ధిదారుల వివరాలను జాబితా నుంచి తొలగించాలని చెప్పారు. ఉపాధి హామీ నిధులతో చేపట్టిన గ్రామ పంచాయతీ, అంగన్‌‌‌‌వాడీ భవనాలు, పాఠశాల ప్రహరీ, సీసీ రోడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలన్నారు.