V6 News

ముందు సీబీఐ క్లీన్ చీట్ తెచ్చుకో.. అజారుద్దీన్ కు TCA వార్నింగ్

ముందు సీబీఐ క్లీన్ చీట్ తెచ్చుకో.. అజారుద్దీన్ కు TCA వార్నింగ్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అజారుద్దీన్ తీరుపై మండిపడ్డారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యెండల లక్ష్మీనారాయణ, సెక్రటరీ గురువారెడ్డి. మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో ఇప్పటికీ సీబీఐ నుంచి క్లీన్ చిట్ తెచ్చుకోకుండా.. TCAకు లీగల్ నోటీస్ లు పంపడమేంటని వారు ప్రశ్నించారు. HCA అధ్యక్షుడిగా ఉన్న అజహరుద్దీన్.. తెలంగాణ క్రికెట్ కు చేసిందేమీ లేదన్నారు. HCA సెలక్షన్స్ లోనూ పారదర్శకత లేదని.. ఇదేంటని ప్రశ్నించినవారిని అజహర్ బెదిరింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. అజారుద్దీన్ పై ఉన్న సీబీఐ కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలుస్తామన్నారు.