జూ. ఎన్టీఆర్ను కలిసిన టీమిండియా

జూ. ఎన్టీఆర్ను కలిసిన టీమిండియా

న్యూజిలాండ్తో తొలి వన్డే ఆడేందుకు హైదరాబాద్కు చేరుకున్న టీమిండియా జూనియర్ ఎన్టీఆర్ను కలుకుంది. సూర్యకుమార్ యాదవ్, శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, చహల్, శార్దుల్ ఠాకూర్తో పాటు పలువురు క్రికెటర్లు సోమవారం రాత్రి ఎన్టీఆర్ను కలిశారు. గతంలో ఖరీదైన కార్ల కలెక్షన్ తో ఆకట్టుకున్న హైదరబాద్ వాసీ నజీర్ ఖాన్కు టీమిండియాలోని కొందరు ఆటగాళ్లు స్నేహితులు. ఈ క్రమంలోనే నజీర్ ఖాన్ ఇంట్లో జూనియర్ ఎన్టీఆర్ను భారత ఆటగాళ్లు కలిశారు. RRR చిత్రంలోని నాటు నాటు సాంగ్కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ను కలిసి టీమిండియా ప్లేయర్స్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీమిండియాతో భీమ్  అంటూ  అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. 


మరోవైపు శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా..న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్, మూడు టీ20ల సిరీస్ ఆడబోతుంది. ఇందులో భాగంగా తొలి వన్డే హైదరాబాద్లో జరగనుంది. ఇప్పటికే న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ భాగ్యనగరానికి చేరుకోగా..సోమవారం సాయంత్రం టీమిండియా హైదరాబాద్కు వచ్చింది.