పికిల్ బాల్ ప్లేయర్స్తో వెళ్తున్న విమానం క్రాష్.. టెక్సాస్లో ఐదు మంది మృతి

పికిల్ బాల్ ప్లేయర్స్తో వెళ్తున్న విమానం క్రాష్.. టెక్సాస్లో ఐదు మంది మృతి

యెనైటెడ్ స్టేట్స్ టెక్సాస్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. పికిల్ బాల్ ప్లేయర్స్ తో వెళ్తున్న చిన్న విమానం క్రాష్ అయ్యింది.  గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదు మంది దుర్మరణం చెందారు. ఆస్టిన్ కు 64 కి.మీ. దూరంలో వింబర్లీ సిటీ సమీపంలో క్రాష్ సంభవించినట్లు అధికారులు తెలిపారు. 

సెస్నా 421 సీ అనే ప్లేన్  ఒక్క సారిగా క్రాష్ కు గురి కావటంతో  భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. భూకంపం వచ్చినట్లు భయభ్రాంతులకు గురైనట్లు స్థానికులు తెలిపారు.  అయితే గాలిలో ఉన్నపుడు ఎలాంటి ప్రమాద సూచికలు కనపడక పోవ డంతో క్రాష్ జరిగినట్లు గుర్తించేందుకు అధికారులకు సమయం పట్టింది. 

ఘటన జరిగే ముందు ప్లేన్ హై స్పీడ్ లో వెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. మృతుల్లో ఒక పైలట్ తో పాటు నలుగురు ప్లేయర్లు ఉన్నారు.