27న కృష్ణా బోర్డు మీటింగ్

27న కృష్ణా బోర్డు  మీటింగ్

ఈ నెల 27న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు 14వ సమావేశం జరగనుంది. ఈ ఫుల్ బోర్డ్ మీటింగ్ కు హాజరు కావాలని బోర్డ్ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురే తెలంగాణ, ఏపీకి లేఖ రాశారు. మీటింగ్ లో చర్చించే ఎజెండాను లేఖతో పంపారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ మూడున్నర కోట్లు విడుదల చేసింది. రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ నిధులు ఇవ్వడం లేదన్నారు అధికారులు. ప్రస్తుతం బోర్డు ఖాతాలో 2 కోట్ల 46 లక్షలు మాత్రమే ఉన్నాయని, వీటితో నిర్వహణ కష్టమని తెలిపారు. రెండు రాష్ట్రాలు వెంటనే 10 కోట్ల చొప్పున నిధులు విడుదల చేయాలని సూచించారు. ఈ నెల 9న జరిగిన నిర్వహించిన మీటింగ్ కు తెలంగాణ అధికారులు, ఇంజినీర్లు హాజరు కాలేదు. 

కృష్ణా బోర్డు సమావేశంలో చాలా అంశాలు చర్చకు రానున్నాయి. కృష్ణ బేసిన్ లో లభ్యమయ్యే నీటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడం, తెలంగాణ కోరినట్టు రెండు రాష్ట్రాలకు చెరిసగం వాటాపై చర్చించడం, ఒక సంవత్సరంలో వాడుకోలేకపోయిన నీటిని తర్వాతి ఏడాదికి క్యారీ చేయడంపై చర్చించనున్నారు. ప్రాజెక్టులన్నీ నిండి సర్ ప్లస్ అయ్యే రోజుల్లో నీటి వినియోగం అంశాలపై డిస్కస్ చేయనున్నారు. అలాగే కృష్ణా జ్యూరిస్ డిక్షన్ అమలు, కొత్త ప్రాజెక్టులకు 6 నెలల్లోగా అనుమతులు, కరెంట్ ఉత్పత్తి వివాదాలు, మైనర్ ఇరిగేషన్ కింద నీటి వాడకం, కృష్ణా బేసిన్ కు గోదావరి జలాల మళ్లింపు, KRMB హెడ్ క్వార్టర్ విశాఖపట్నానికి తరలింపుపై మీటింగ్ లోచర్చింయనున్నారు. 

మరోవైపు పవర్ జనరేషన్, ట్రాన్స్ మిషన్ కు సంబంధించి 2 రాష్ట్రాల పరిధిలోని హైడ్రో పవర్ స్టేషన్లకు శాంక్షన్ అయిన పోస్టుల వివరాలు ఇవ్వాలని కృష్ణా బోర్డు కోరింది. తెలంగాణ, ఏపీ ఎనర్జీ డిపార్ట్ మెంట్ సెక్రటరీలకు బోర్డ్ మెంబర్ సెక్రటరీ డీఎం రాయ్ పురే లేఖ రాశారు. కేంద్రం కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ గెజిట్ జారీ చేసినందున రెండో షెడ్యూల్ లో చేర్చిన ప్రాజెక్టు సిబ్బంది, ఇతర వివరాలు తెలపాలని కోరారు.