తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వం

 తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వం

సిద్దిపేట : తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల ప్ర‌భుత్వ‌మ‌ని రాష్ట్రం ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, పోలీస్ కమిషనరేట్, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కూడా సిద్దిపేట నుంచే ప్రారంభం అయిందన్నారు. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట అండగా ఉందని గుర్తు చేసుకున్నారు. సిద్దిపేట జిల్లాలోనే పుట్టి పెరిగారని.. తాను పుట్టిపెరిగిన సిద్దిపేటలో తొలి కలెక్టరేట్‌ సముదాయం ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సిద్దిపేట జిల్లా ప్రజలకు సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలంగాణ కోసం ఎన్నో కష్టాలు పడ్డామన్నారు.

ఇలాంటి అభివృద్దే తెలంగాణ కోరుకుంది..
సమైక్య పాలనలో నీటి సమస్యతో తెలంగాణ ఇబ్బంది పడిందన్నారు. ఆ రోజుల్లో బావులను, బోర్లను అద్దెకు తీసుకుని ట్యాంకర్లతో నీటిని అందించామని గుర్తు చేసుకున్నారు. ఆ రోజులు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ భయం వేస్తుందన్నారు. ప్రస్తుతం చెరువులన్నీ నిండాయని, ఇలాంటి అభివృద్ధినే తెలంగాణ కోరుకుందని చెప్పారు. మే నెలలో కూడా చెరువులు అలుగు పారుతున్నాయని.. హల్దీ, కూడవెళ్లి వాగులు ఏప్రిల్, మే నెలల్లోనూ పొంగిపొర్లాయన్నారు. వీటి కోసమే తెలంగాణ సాదించుకున్నామని.. అందుకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

గోదాముల సామ‌ర్థ్యం 25 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు పెంపు..