మొదటి రోజే హామీ అమలు

మొదటి రోజే హామీ అమలు

వికారాబాద్​, వెలుగు: వికారాబాద్​ జిల్లా మోమిన్​పేట మండలంలోని కొలుకుంద సర్పంచ్​ కరుణం కీర్తి రామక్రిష్ణ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. తొలి రోజే తాను ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలో ఒకటి నెరవేర్చారు. క్రిస్మస్​ పండుగను పురస్కరించుకుని మహిళలకు చీరలు, పురుషులకు షర్ట్, ధోతీలు క్రిస్మస్​ కానుక కింద పంపిణీ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ హామీని నెరవేస్తానని సర్పంచ్​ చెప్పారు.

ఉచిత ఆటో సర్వీసు ప్రారంభం

చేవెళ్ల: చేవెళ్ల మండలం ఆలూరు సర్పంచ్​ భాగ్య శేఖర్ గౌడ్ సోమవారం  ప్రమాణస్వీకారం రోజే తాను ఇచ్చిన హామీని నెరవేర్చారు.  గ్రామంలోని దివ్యాంగులు, వృద్ధులు, గర్భిణుల కోసం ఉచితంగా ఎలక్ట్రికల్ ఆటో సర్వీసు అందిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట  ప్రకారం ఆటో సర్వీస్ ప్రారంభించారు.