ఈ తొమ్మిందింటిలో ఏ గుర్తింపు కార్డు ఉన్నా ఓటేయొచ్చు

ఈ తొమ్మిందింటిలో  ఏ గుర్తింపు కార్డు ఉన్నా ఓటేయొచ్చు
  • ఓటర్ స్లిప్ తప్పనిసరి 
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రూల్స్  జారీ

హైదరాబాద్, వెలుగు :  ఆదివారం జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.  ఇందులో ఓటర్లు పాటించాల్సిన రూల్స్ ను శుక్రవారం ఎన్నికల అధికారులు జారీ చేశారు. ఓట‌‌రు గుర్తింపుకార్డు లేకున్నా ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.  ఓటర్ స్లిప్ తోపాటు ఎన్నికల అధికారులు సూచించిన తొమ్మిది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉంటేనే  పోలింగ్ కేంద్రంలోకి అనుమతించనున్నారు.ఇందులో ఆధార్, పాస్‌‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్‌‌, ఫొటోతో కూడిన‌‌ స‌‌ర్వీస్ ఐడెంటిటీ కార్డు, పాన్ కార్డు, ఎమ్మెల్సీ,ఎంపీ,ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం, టీచర్లు, గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీచేసిన గుర్తింపు కార్డు, యూనివర్సిటీలు జారీచేసిన డిగ్రీ/ డిప్లామా ఒరిజనల్ సర్టిఫికెట్లు, దివ్యాంగులకు జారీచేసిన అధికారిక గుర్తింపు కార్డులు ఇలా తొమ్మిదింటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును పోలింగ్ కేంద్రంలో చూపవచ్చు.  పోలింగ్ అధికారి ఇచ్చే బ్యాలెట్ పేపర్ తోపాటు ఓటు వేసేందుకు వారిచ్చే పెన్నును మాత్రమే ఓటర్లు వాడాలని తెలిపారు. ఆ పెన్నుతో ప్రాధాన్యత క్రమంలోనే 1, 2, 3... ఇలా నంబర్లను రాస్తే సరిపోతుందన్నారు. ఇందులో మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పనిసరిగా వేయాల్సిందేనన్నారు.