పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.. వైఎస్ షర్మిల ట్వీట్

పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.. వైఎస్ షర్మిల ట్వీట్

ఏప్రిల్ 19న మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా ఆమె కూతురు వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మీ అనంతమైన ప్రేమకు ధన్యవాదాలు.. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ.. మీరు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తూ షర్మిల, తన తల్లికి ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

విజయమ్మ బర్త్ డే సందర్భంగా వైఎస్ఆర్టీపీ కార్యకర్తలు, అభిమానులు, పలువురు ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ప్రజల కష్టాలు తీర్చడానికి తన కుటుంబం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ధైర్యం చెప్పే మాత్రుమూర్తి..‌.వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ సోషల్ మీడియాలో పలు రకాలుగా ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు.

https://twitter.com/realyssharmila/status/1648542190077968384