ఇటీవల హైదరాబాద్ లో నకిలీ డాక్టర్ల బాగోతం వెలుగులోకి వచ్చిన ఘటన మరువక ముందే మేడ్చల్ లో మరో ఇద్దరు నకిలీ డాక్టర్ల గుట్టు రట్టయ్యింది. మంగళవారం ( సెప్టెంబర్ 1 ) మేడ్చల్ జిల్లా ఎల్లంపేటలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు ఇద్దరు నకిలీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో అంజాగౌడ్, సుధాకర్ చారి నకిలీ డాక్టర్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే క్లినిక్ లు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్యం అందిస్తున్న ఇద్దరు వ్యక్తులను కుత్బుల్లాపూర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
►ALSO READ | మెదక్ జిల్లాలో పోలీస్ ఇంట్లో బైక్ చోరీ.. 24 గంటల్లోనే దొంగ అరెస్ట్
ముందస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఇద్దరు నకిలీ డాక్టర్లను అదుపులోకి తీసుకున్నరు. వైద్య వృత్తికి అవసరమైన అర్హతలు లేకుండానే క్లినిక్లు నిర్వహిస్తూ రోగులకు చికిత్స అందిస్తున్న ఈ ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.అనంతరం వారిని మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మేడ్చల్ పోలీసులు.
