స‌రిహద్దులో నేపాల్ పోలీసుల కాల్పులు.. భార‌తీయుడు మృతి

స‌రిహద్దులో నేపాల్ పోలీసుల కాల్పులు.. భార‌తీయుడు మృతి

ఇండో-నేపాల్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నలుగురు భారత పౌరులపై నేపాల్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక పౌరుడు మృతి చెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్ సోన్ బర్సా సరిహద్దులోని మొహొబా గ్రామంలోని లాల్‌బండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమై భద్రత కట్టుదిట్టం చేశారు.

ఈ ఘ‌ట‌న‌పై బీహార్ సెక్టార్ ఐజీ శశాస్త్ర సీమా బ‌ల్ మాట్లాడుతూ.. ఇండో నేపాల్ స‌రిహ‌ద్దులోని బీహార్ సీతామారి వ‌ద్ద ఈ కాల్పులు జ‌రిగాయ‌ని చెప్పారు. కాల్పుల ఘ‌ట‌న గురించి రాష్ట్ర ప్ర‌భుత్వానికి స‌మాచారం అందించామని,‌ గాయ‌ప‌డిన ఇద్ద‌రిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు. భార‌తీయ పౌరుల‌‌పై నేపాల సైన్య‌మే ఈ కాల్పుల‌కు తెగ‌బ‌డిన‌ట్టు స్థానికులు చెప్పార‌న్నారు.

గత కొద్ది రోజులుగా భారత్‌, నేపాల్‌ల మధ్య సరిహద్దు వివాదం జరుగుతూనే ఉంది. భారత్, నేపాల్ సరిహద్దుల్లో ఉన్న మూడు పట్టణాలు లిపులేక్, కాలాపాని, లింపియాధురా పట్టణాలను తమవే అంటూ నేపాల్ కొన్ని రోజుల క్రితం ఓ మ్యాప్‌ను రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

1 killed in firing near India-Nepal border in Bihar, locals say shots fired by Nepal police