10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం

10 ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం

ఆర్థిక కష్టాల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించేందుకు బ్యాంకుల సంస్కరణలపై దృష్టి పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా… పది ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ను విలీనం చేస్తున్నట్టు చెప్పారు. అలాగే కెనరా బ్యాంక్ లో సిండికేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కార్పోరేషన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ ను, ఇండియన్ బ్యాంక్ లో  అలహాబాద్ బ్యాంక్ ను విలీనం చేస్తున్నట్టు తెలిపారు. దీని ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతమవుతున్నారు. 2017 వరకు దేశంలో 27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులుండగా.. వాటి సంఖ్య ఇప్పుడు 12కు తగ్గిందని చెప్పారు.

తమ ప్రభుత్వం వచ్చాక NPAలు చాలా వరకు తగ్గాయన్నారు  నిర్మలాసీతారామన్. రికార్డు స్థాయిలో లక్షా 21 వేల 76 కోట్ల లోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. NPAలు 8 లక్షల 65 వేల కోట్ల నుంచి.. 7 లక్షల 90 కోట్లకు తగ్గాయన్నారు. 250కోట్లు దాటిన రుణాలపై మానిటరింగ్ కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

విలీనంతో బ్యాంకుల్లో అంతర్గత సమస్యలు పెరుగుతాయన్నారు ఉత్తరాఖండ్ మాజ సీఎం హరీశ్ రావత్. గతంలో జరిగిన విలీనాలు మంచి ఫలితాలనివ్వలేదన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న సమస్యలను మొదట పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.

శనివారం దేశ్యాప్తంగా బ్యాంకుల ఆందోళన

విలీనంపై ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి నిరసనగా రేపు దేశవ్యాప్తంగా ఆందోళనా కార్యక్రమాలకు పిలుపునిచ్చింది.

ఓ వైపు కేంద్రం ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భారత ఆర్థికవ్యవస్థ దిగజారుతూనే ఉంది. దీంతో ఆర్థికాభివృద్ధి ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. జూన్ తో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీడీపీ 5 శాతానికి దిగజారింది. అంతకుముందటి త్రైమాసికంలో 5.8 శాతంగా ఉన్న జీడీపీ.. 8 పాయింట్లు పడిపోయి 5 శాతానికి చేరింది. అటు తయారీరంగం భారీగా క్షీణించింది. 2018-19 ఆర్థికసంవత్సరం మొదటి త్రైమాసికంలో 12.1 శాతంగా ఉన్న వృద్ధిరేటు.. 2019-20 ఆర్థికసంవత్సర మొదటి త్రైమాసికంలో 0.6 గా నమోదైంది.