కొత్తగా 4 ఐపీఓలు ఓపెన్..అన్నీ ఎస్‌‌ఎంఈ ఐపీఓలే

కొత్తగా 4 ఐపీఓలు ఓపెన్..అన్నీ ఎస్‌‌ఎంఈ ఐపీఓలే
  • అన్నీ ఎస్‌‌ఎంఈ ఇష్యూలే 

న్యూఢిల్లీ: ఈ వారం ఇన్వెస్టర్ల ముందుకు నాలుగు ఐపీఓలు వస్తున్నాయి. ఇవన్ని  స్మాల్‌‌ అండ్ మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజ్‌‌ (ఎస్‌‌ఎంఈ) ఐపీఓలే.  మరోవైపు ఈ వారం నాలుగు కంపెనీల లిస్టింగ్ కూడా ఉంది. కిందటి వారం ఇన్వెస్టర్ల ముందుకొచ్చిన జేఎన్‌‌కే ఇండియా పబ్లిక్ ఇష్యూ  28 రెట్లు సబ్‌‌స్క్రయిబ్ అయ్యింది. 

ఈ వారం ఓపెన్ కానున్న 4 ఐపీఓలు..

1) స్టోరేజ్‌‌ టెక్నాలజీస్‌‌  అండ్ ఆటోమేషన్‌‌..

ఈ కంపెనీ ఐపీఓ ఏప్రిల్‌‌ 30న ఓపెన్ కానుంది. మే 3న ముగుస్తుంది. ఒక్కో షేరును రూ.73–78 రేంజ్‌‌లో అమ్ముతున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.29.95 కోట్లు సేకరించాలని స్టోరేజ్‌‌ టెక్నాలజీస్  చూస్తోంది. 

2) ఆమ్కే ప్రొడక్ట్స్‌‌..

ఆమ్కే ప్రొడక్ట్స్ ఐపీఓ ఈ నెల 30న ఓపెన్ కానుండగా,  మే 3న ముగుస్తుంది. ఐపీఓ ద్వారా రూ.12.61 కోట్లు సేకరించాలని ఈ కంపెనీ చూస్తోంది.  ఒక్కో షేరును రూ.52–55 రేంజ్‌‌లో అమ్ముతున్నారు. 

3) సాయి స్వామి మెటల్స్‌‌ అండ్ అల్లోయ్స్‌‌ ..

ఈ కంపెనీ ఐపీఓ కూడా ఈ నెల 30న ఓపెన్ కానుంది. మే 3న ముగుస్తుంది. ఒక్కో షేరు రూ.60 దగ్గర అందుబాటులో ఉంటుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.15 కోట్లు సేకరించాలని సాయి స్వామి మెటల్స్ ప్లాన్ చేస్తోంది. 

4) స్లోన్‌‌ ఇన్ఫోసిస్టమ్స్‌‌ 

స్టోన్‌‌ ఇన్ఫోసిస్టమ్స్‌‌ ఐపీఓ మే 3న ఓపెన్ కానుండగా, మే 7న ముగియనుంది. ఐపీఓలో ఒక్కో షేరును రూ.79 కి అమ్ముతున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.11.06 కోట్లను సేకరించాలని స్లోన్ ఇన్ఫోసిస్టమ్స్‌‌ ప్లాన్ చేస్తోంది.