ఇండియా ఏఐ ఫినాలేకు వందమంది ఎంపిక

ఇండియా ఏఐ ఫినాలేకు వందమంది ఎంపిక

 

  • అదరగొట్టిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 

హైదరాబాద్, వెలుగు: ఓపెన్‌‌‌‌ ఏఐ అకాడమీ, నెక్స్ట్‌‌‌‌వేవ్  సంయుక్తంగా నిర్వహించిన బిల్డాథాన్‌‌‌‌లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అదరగొట్టారు. ఏకంగా 1,500 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. హైదరాబాద్‌‌‌‌లో 900 మంది, విజయవాడలో 500 మందికి పైగా విద్యార్థులు రాష్ట్రస్థాయి క్వాలిఫైయర్స్‌‌‌‌కు అర్హత సాధించారు. వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వంద మంది విద్యార్థులు.. కేంద్ర ప్రభుత్వం ఇండియా ఏఐ మిషన్​ కింద వచ్చే ఫిబ్రవరి నెలలో నిర్వహించే గ్రాండ్ ఫినాలే ఇండియా ఏఐ ఇంపాక్ట్ 2026 సమ్మిట్​కు ఎంపికయ్యారు. 

ఈ సందర్భంగా నెక్ట్స్ వేవ్ సీఈఓ రాహుల్ అట్టులూరి మాట్లాడుతూ.. ప్రాంతీయ బిల్డాథాన్‌‌‌‌ల ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని టైర్-2, టైర్-3 నగరాల్లోని విద్యార్థుల్లో దాగి ఉన్న ఏఐ  ప్రతిభను బయటకు తీయగలిగామని తెలిపారు. 48 గంటల జెన్ ఏఐ స్ప్రింట్స్, ఏఐ విద్యార్థుల భవిష్యత్తును ఎలా మార్చివేస్తుందో తెలియజేస్తున్నదని చెప్పారు.