వివాహిత మృతి కేసులో ముగ్గురు అరెస్ట్.. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలంలో ఘటన

వివాహిత మృతి కేసులో ముగ్గురు అరెస్ట్.. యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలంలో ఘటన

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం గొల్లగూడెంలో వివాహిత ఐశ్వర్య(25)తో పాటు ఆమె ఇద్దరు పిల్లలు ఝాన్సీ(2), పండు(10 నెలలు) మృతి చెందిన కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. ఘటనా స్థలంలో లభించిన లేఖ ఆధారంగా ఇది ఆత్మహత్యగా భావించినప్పటికీ, ఐశ్వర్య తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను అల్లుడు మహేశ్, అత్త సత్తమ్మ, మామ నర్సింహా వేధింపులకు గురిచేసి హత్య చేశారని ఫిర్యాదు చేశారు. 

పెళ్లైనప్పటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపించారు. ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న భర్త, అత్తమామలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌‌కు తరలించారు. ఐశ్వర్య అంత్యక్రియలు ఆమె తల్లిదండ్రుల స్వగ్రామమైన వలిగొండ మండలం వేములకొండలో బుధవారం నిర్వహించారు. ఐశ్వర్య మృతిపై తల్లిదండ్రులు హత్యగా ఫిర్యాదు చేసినప్పటికీ, కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు ఆత్మహత్యగా ప్రసారం చేయడంపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.