అమరావతి: ఏపీలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చేశాయ్. మంత్రి నారా లోకేష్ ఫలితాలను విడుదల చేశారు. అయితే.. టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ను ప్రభుత్వం ప్రకటించింది. మే 25 నుంచి జూన్ 4 తేదీల మధ్య ఏపీలో టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పరీక్షలు రాసేందుకు మే 1 నుంచి మే 9 లోపు పరీక్ష ఫీజు చెల్లించడానికి విద్యార్థులకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇక.. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం మే 1 నుంచి 7 లోపు అప్లై చేసుకోవాలని విద్యార్థులకు కీలక సూచన చేసింది.
ఇక.. వెల్లడైన టెన్త్ ఫలితాల విషయానికొస్తే.. విద్యార్థులు 85.25 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిలు 82.68 శాతం ఉత్తీర్ణత సాధించగా, అమ్మాయిలు 87.90 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీలో మొత్తం 6 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు. ఏపీ టెన్త్ ఫలితాలను.. https://results.bse.ap.gov.in వెబ్ సైట్ క్లిక్ చేసి తెలుసుకోవచ్చని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అంతేకాకుండా.. వాట్సాప్ నుంచి కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. వాట్సాప్ నుంచి 9552300009 నంబర్కు Hi అని మెసేజ్ చేసి ఏపీ టెన్త్ ఫలితాలను తెలుసుకోవచ్చు.
* పార్వతీ పురం మన్యం జిల్లాల్లో 96.07 శాతం ఉత్తీర్ణత
* అల్లూరు సీతారామరాజు జిల్లాలో 57.02 శాతం ఉత్తీర్ణత
* రాష్ట్రంలో 2161 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత
* మే 25 నుంచి జూన్ 4 తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు
* సప్లిమెంటరీ పరీక్షల ఫీజు మే1 నుంచి మే 9 వరకు చెల్లించాలి
* లేట్ ఫీజు 50 రుపాయిలతో మే10 నుంచి మే 25 వరకు చెల్లించే అవకాశం
* రీ రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం మే 1నుంచి 7 వరకు అప్లై చేసుకోవచ్చు
* రీకౌంటింగ్ ఒక్కో సబ్జెక్టుకు 500, రీ వెరిఫికేషన్ ఒక్కో సబ్జెక్టుకు 1000 ఫీజ్ చెల్లించాలి

