V6 News

ఈత సరదా..స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతి

ఈత  సరదా..స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతి

ఈత  సరదా ఓ పిల్లాడి ప్రాణం తీసింది. సరదాగా నీటిలో ఆడుకుందామనుకున్న 11 ఏళ్ల పిల్లాడు శవంగా మారాడు. హైదరాబాద్ హఫీజ్ బాబా నగర్ లో 11 ఏళ్ళ బాలుడు స్విమ్మింగ్ ఫూల్లో మునిగి చనిపోయాడు. నీటిలో మునిగి కొడుకు చనిపోవడంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

హైదరాబాద్  కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హఫీజ్‌బాబా నగర్‌లో  11 ఏండ్ల మహ్మద్ గౌస్ తన స్నేహితులతో కలిసి క్వాద్రీ స్విమ్మింగ్ పూల్‌కు ఈతకు వెళ్లాడు. స్విమ్మింగ్‌ పూల్‌లో దిగాడు. అయితే అప్పటికే స్విమ్మింగ్ పూల్ కిక్కిరిసి ఉంది. గౌస్ ను అతని స్నేహితులు  గమనించలేకపోయారు. ఈత రాకపోవడంతో గౌస్ నీటిలో మునిగిపోయారు. చుట్టూ ప్రక్కల వాళ్లు కూడా గమనించలేకపోయారు. కొద్ది సేపటి తర్వాత గౌస్ కోసం స్నేహితులు వెతికారు. కానీ అప్పటికే ఆలస్యం అయింది. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ నుంచి గౌస్ మృతదేహాన్ని వెలికి తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు క్వాడ్రీ స్విమ్మింగ్ పూల్ నిర్వహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు..పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.