లైఫ్ రిస్క్ లో పెట్టి అంబులెన్స్ కు దారి చూపిన బుడ్డోడు

లైఫ్ రిస్క్ లో పెట్టి అంబులెన్స్ కు దారి చూపిన బుడ్డోడు
  • వరద నీటిలో నుంచి పరుగుతీస్తూ అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దారి
  • కర్నాటక కు చెందిన వెంకటేష్ అనే పిల్లాడు
  • సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో వైరలైన బుడ్డోడి సాహసం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కర్నాటక రాష్ట్రం అతలాకుతలమవుతోంది. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాకపోకలకు వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్బంది పడుతున్నాయి. ఎమర్జెన్సీ సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు మాత్రం తప్పకుండా పనిచేయాల్సిన పరిస్థితి. ఇలా కొందరు చిన్నారులతో ఆస్పత్రికి బయలుదేరిన  ఓ అంబులనెన్సుకు మధ్యలో ఓ వాగు అడ్డొచ్చింది. బ్రిడ్జి మునిగిపోయింది. రోడ్డెక్కడుందో డ్రైవర్​కు అర్థం కాలేదు. అయితే పక్కనే ఆడుకుంటున్న ఓ పన్నెండేళ్ల బాలుడు బ్రిడ్జిపై నుంచి పరుగెడుతూ అంబులెన్సుకు దారి చూపి ంచాడు.

రాయచూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని హిరిరాయనకుంపి గ్రామం వద్ద ఓ వాగు నీళ్లు రోడ్డుమీద నుంచి మోకాళ్లలోతు ప్రవహిస్తున్నాయి. అదే సమయంలో అనారోగ్యంతో ఉన్న ఆరుగురు చిన్నారులు, ఓ మహిళ డెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాడీతో హాస్పటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లాల్సిన అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీళ్లు ప్రవహిస్తున్న రోడ్డు దాటాల్సి ఉంది. అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆ రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త కావడంతో రోడ్డు దాటేందుకు ధైర్యం చేయలేకపోతున్నాడు. అక్కడికి సమీపంలోనే ఆడుకుంటున్న  అదే గ్రామానికి చెందిన 12 ఏళ్ల వెంకటేష్​ పరిస్థితిని గమనించి హెల్ప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తానంటూ ముందుకొచ్చాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న వరదలోంచి తను ముందు పరుగెడుతుంటే అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతడిని అనుసరించింది. అంత ప్రవాహంలోంచి ధైర్యంగా అంబులెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్రైవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దారిచూపుతూ వెంకటేష్​ చేసిన సాహసాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త వైరలైంది. ఇండిపెండెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డే సందర్భంగా స్థానికులు వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సన్మానించారు. ఆ బుడ్డోడు గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆరో తరగతి చదువుతున్నాడు.

వర్ష బీభత్సానికి కర్నాటకలో 60 మంది చనిపోగా 15 మంది మిస్సయ్యారు. 22 జిల్లాల పరిధిలో 7 లక్షల మంది నిరాశ్రయులైనట్టు సమాచారం. వీరి కోసం ప్రభుత్వం వెయ్యి క్యాంపులను ఏర్పాటు చేసింది.