MaayaOne Teaser: సైన్స్ ఫిక్షన్ కథాంశంతో మాయావన్.. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్

MaayaOne Teaser: సైన్స్ ఫిక్షన్ కథాంశంతో మాయావన్.. విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవల్

ఊరుపేరు భైరవకోన(Ooru Peru Bhairavakona) సక్సెస్ తరువాత ఫుల్ జోష్ లో ఉన్నాడు టాలీవుడ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan). ఆ జోష్ లోనే వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇటీవలే.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కినితో కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు ఈ హీరో. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. 

ఇటీవల సందీప్ కిషన్ హీరోగా ప్రాజెక్టు Z అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. దాదాపు 7 సంవత్సరాల గ్యాప్ తరువాత ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే.. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటీవ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టు Z సినిమాను తెరకెక్కించిన దర్శకుడు CV కుమార్ మాయావన్ ను కూడా తెరకెక్కిస్తున్నాడు.  AK ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 

తాజాగా.. ఈ సినిమా నుండి టీజర్ విడుదల చేశారు మేకర్స్. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ టీజర్ నెక్స్ట్ లెవల్లో డిజైన్ చేశారు మేకర్స్. ఇక టీజర్లో మురళీ శర్మ.. ఒక్కసారి పురాణాలు దాటి చూస్తే.. తనని తాను దేవుడిగా భావించిన ప్రతి మనిషి మారింది రాక్షసుడిగానే. అలాంటి రాక్షసుడు వచ్చిన ప్రతిసారి.. ఆ దేవుడు పంపించేది మొండితనాన్ని ఆయుధంగా మార్చుకొని పోరాడే ఓ సామాన్యుడినే.. అనే డైలాగ్ సినిమాపై అంచనాలు పెంచేసింది. విజువల్స్ కూడా కళ్ళు చెదిరేలా ఉన్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను దక్కించుకుంటుందో చూడాలి.