వెట్టిచాకిరి నుంచి 13 మంది చిన్నారులకు విముక్తి

వెట్టిచాకిరి నుంచి 13 మంది చిన్నారులకు విముక్తి

హైదరాబాద్: 13 మంది చిన్నారులను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించారు పోలీసులు. బాలాపూర్ లోని ఓ బ్యాంగిల్స్ తయారీ ఫ్యాక్టరీలో 10 నుంచి 12 సంవత్సరాల వయసుగల బాల, బాలికలు పని చేస్తున్నారు. తక్కువ జీతంతో వారితో ఎక్కువ పని చేయిస్తున్నారు. పిల్లలను బీహార్ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చిన ముఠా ..ఫ్యాక్టరీలతో కమీషన్ మాట్లాడుకుంటారని తెలిస్తుంది.

బాలకార్మికుల విషయం తెలిసిన పోలీసులు గురువారం ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా గాజుల తయారీ కేంద్రంపై దాడి చేశారు. అక్కడ బిక్కుబిక్కుమంటూ పాత బట్టలతో పని చేస్తున్న బాలలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. పిల్లలకు ధైర్యం చెప్పి రక్షించారు. చిన్నారులను పనిలో కుదిర్చిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు పోలీసులు.