ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు‘ఆకర్షణ’ నామినేట్

  ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుకు‘ఆకర్షణ’ నామినేట్
  • పాకెట్​ మనీతో 24 లైబ్రరీలు ఏర్పాటు చేసిన చిన్నారి

పద్మారావునగర్, వెలుగు: చిన్నారుల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించేందుకు తన పాకెట్​ మనీతో వరుసగా లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్న తొమ్మిదో తరగతి స్టూడెంట్​, 13 ఏండ్ల చిన్నారి ఆకర్షణ ప్రైడ్​ ఆఫ్​ తెలంగాణ అవార్డ్స్​ – 2025కు నామినేట్​ అయింది. అనాథ వసతిగృహాలు, స్కూళ్లలో ఇప్పటివరకు ఆకర్షణ 24 ఓపెన్ లైబ్రరీలను ఓపెన్​ చేశారు. 

www.prideoftelangana.com వెబ్​సైట్​ద్వారా, లేదా ఆర్​టీపీవోటీ 20 టైప్‌‌ చేసి 9212356765 నంబర్​కు మెసేజ్​ పంపడం ద్వారా తమకు ఓటు వేయవచ్చని ఆకర్షణ తండ్రి సతీశ్​ తెలిపారు. సెప్టెంబర్‌‌ 5 నుంచి 20 వరకు ఓటింగ్​ జరుగనుంది.