అవయవదానం చేసిన18 నెలల పసికందు

అవయవదానం చేసిన18 నెలల పసికందు
  • అవయవదానం చేసిన18 నెలల పసికందు
  • రెండు ప్రాణాలను నిలబెట్టిన చిన్నారి తల్లిదండ్రులు
  • మరోఇద్దరికి పునర్జన్మనిచ్చిన ఎనిమిదేండ్ల పాప

న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు బ్రెయిన్ డెడ్ అయిన చిన్నారుల అవయవాలు నాలుగు ప్రాణాలను నిలబెట్టాయి. హర్యానాలోని మేవాత్ కు చెందిన 18 నెలల బాలిక మహిరా ఈ నెల 6న ఇంట్లో బాల్కనీ నుంచి కిందపడి తలకు గాయమైంది. ఎయిమ్స్ ట్రామా కేర్ సెంటర్​కు తరలించగా, ఆ చిన్నారికి బ్రెయిన్ బాగా దెబ్బ తిన్నట్లు డాక్టర్లు గుర్తించారు. చివరకు ఈ నెల 11న బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. ఆ పాప పేరెంట్స్ తో మాట్లాడి ఆర్గాన్ డొనేషన్​కు ఒప్పించారు. అనంతరం మహిరా నుంచి సేకరించిన లివర్​ను ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్​లో చికిత్స పొందుతున్న ఆరు నెలల చిన్నారికి మార్పిడి చేశారు.

రెండు కిడ్నీలను ఎయిమ్స్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న 17 ఏళ్ల అబ్బాయికి ట్రాన్స్​ప్లాంట్ చేశారు. పాప కార్నియాలు, హార్ట్ వాల్వ్​లను భద్రపర్చామని, తర్వాత అవసరమైన వారికి మార్పిడి చేస్తామని ఎయిమ్స్ డాక్టర్లు చెప్పారు. అలాగే, యూపీలోని మథురకు చెందిన 8 ఏండ్ల మానసి కూడా ఈ నెల 2న ఇంటి వద్ద ఎత్తు నుంచి కింద పడిపోయి తలకు గాయమైంది. ఈ పాప కూడా బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మానసి పేరెంట్ల అంగీకారంతో ఆమె లివర్, కిడ్నీని సేకరించి ఐదేండ్ల చిన్నారికి మార్పిడి చేశారు. మరో కిడ్నీని 12 ఏళ్ల అబ్బాయికి ట్రాన్స్ ప్లాంట్ చేశారు.