ఈ నెల 23న సినిమా విడుదల కానున్న ‘18 పేజెస్’

ఈ నెల 23న సినిమా విడుదల కానున్న ‘18 పేజెస్’

‘కార్తికేయ2’తో సూపర్ హిట్ అందుకున్న  నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంట ‘18 పేజెస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘కుమారి 21 ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి సుకుమార్ కథను అందించాడు. జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌‌‌‌పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించారు. ఈ నెల 23న సినిమా విడుదలవుతోంది. శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. సుకుమార్, అల్లు అరవింద్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై ఇంటరెస్ట్ క్రియేట్ చేస్తోంది. ‘నీకు ఫేస్‌‌‌‌బుక్ లేదా?, ఉంటే ఫొటోస్ పెట్టుకోవచ్చు కదా. బోలెడన్ని లైక్స్ వస్తాయి’ అంటూ అనుపమకు చెబుతాడు నిఖిల్. 

కానీ ఆమె కనీసం ఫోన్ కూడా వాడదు. ‘పీరియాడిక్ సినిమాలా పీరియాడిక్ పోరి’ అని తన పాత్రను పోలుస్తుంది సరయూ. లవ్‌‌‌‌తో పాటు ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌‌‌‌తో కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. నిఖిల్, అనుపమ క్యూట్ లుక్స్‌‌‌‌తో ఇంప్రెస్ చేస్తున్నారు.  ‘ప్రేమించడానికి మనకి ఒక రీజన్ ఉండకూడదు. ఎందుకు ప్రేమిస్తున్నారు అంటే దానికి ఆన్సర్ ఉండకూడదు’ అంటూ అనుపమ చెప్పే డైలాగ్ ఇంటరెస్టింగ్‌‌‌‌గా ఉంది.  ఓ డైరీలో ఉన్న 18 పేజీల స్టోరీ వీరిద్దరి మధ్య ప్రేమను ఎన్ని మలుపులు తిప్పుతుందనేది సినిమా.