
నల్గొండ జిల్లా: తిరుమలగిరి మండల టీఆర్ఎస్ నేత సాగవు రాఘవరెడ్డి చేతి వాటం చూపించారు. ఫోర్జరీ సంతకం, నకిలీ డాక్యుమెంట్లతో రెండున్నర కోట్లు టోకరా కొట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగా.. తన పార్టనర్ పూజిత కృష్ణా రెడ్డిని మోసం చేశారు రాఘవరెడ్డి.
గతంలోనే చెక్ ఫోర్జరీ కేసుకింద వీరిని పోలీసులు హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఇప్పుడు సంతకం ఫోర్జరీ నిజమేనని తేల్చారు ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు. గతంలో ఎల్ఐసీలోనూ భారీ స్కాంకు పాల్పడ్డారని తెలిపిన పోలీసులు..రాఘవరెడ్డిని అదుపులోకి తీసుకున్నామని కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.