టెహ్రాన్: ఖమేనీపై నాలుగు దశాబ్దాల క్రితం ఒక టేప్ రికార్డర్ బాంబుతో మొదలైన హత్యాయత్నాలు.. 2026లో అత్యాధునిక క్షిపణి దాడులతో ముగిశాయి. 1981 జూన్ 27న టెహ్రాన్‌లోని అబుజర్ మసీదులో అయతుల్లా అలీ ఖమేనీ ప్రసంగిస్తున్నారు. అప్పటికి ఆయన ఇంకా అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేదు. ఆ సమయంలో ఒక వ్యక్తి జర్నలిస్టు ముసుగులో వచ్చి ఖమేనీ ముందు ఒక టేప్ రికార్డర్‌ను ఉంచాడు.
ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే ఆ టేప్ రికార్డర్ పేలిపోయింది. ఆ భీకర పేలుడులో ఖమేనీ ప్రాణాలతో బయటపడినప్పటికీ, ఆయన కుడి చేయి పూర్తిగా పక్షవాతానికి గురైంది. అప్పటి నుంచి ఆయన తన కుడిచేతిని సరిగా కదపలేరు. ఆ సంఘటన తర్వాతే ఆయన కట్టుదిట్టమైన భద్రత వలయంలోకి వెళ్లారు.
అప్పట్లో టేప్ రికార్డర్ బాంబు నుంచి త్రుటిలో తప్పించుకున్న ఖమేనీ 45 ఏండ్ల తర్వాత అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులకు బలయ్యారు.
